ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిప్రదక్షణ జరిగే ప్రసిద్ధ దేవాలయాలు
1. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
ప్రాంతం: సింహాచలం, విశాఖపట్నం జిల్లా
గిరిప్రదక్షిణ దూరం: సుమారు 32 కిమీ
గిరిప్రదక్షిణ తేది: చైత్ర పౌర్ణమి
ప్రత్యేకత: రాష్ట్రంలో అతిపెద్ద గిరిప్రదక్షణ; లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు
2. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం
ప్రాంతం: అన్నవరం, కాకినాడ జిల్లా
గిరిప్రదక్షిణ దూరం: సుమారు 8 కిమీ
గిరిప్రదక్షిణ తేది: కార్తీక పౌర్ణమి (ప్రత్యేకంగా)
ప్రత్యేకత: రత్నగిరి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం; దీపోత్సవాలు & వ్రతాలు జరుగుతాయి
3. శ్రీ కోదండరామ స్వామి దేవాలయం
ప్రాంతం: శ్రీరామగిరి, ములగపూడి, కాకినాడ జిల్లా
గిరిప్రదక్షిణ దూరం: సుమారు 1.5 కిమీ
గిరిప్రదక్షిణ తేది: వైకుంఠ ఏకాదశి, ప్రతి ఏకాదశి
ప్రత్యేకత: 108 ప్రదక్షిణలు, రాతిపై శ్రీరామపరివార శిలామూర్తులు, అఖండ జ్యోతి