SREE KODANDARAMA TEMPLE

13th century temple

శ్రీ రామ
శ్రీ రామ
12:44 PM

HISTORY

**** జై శ్రీరామ్****

           రౌతులపూడి మండలం ములగపూడి గ్రామం ఎగువన  కొండ ఫై ఉన్న పురాతన  రామాలయానికి విశిష్ట ప్రాధా న్యం ఉంది. ఇక్కడ  ఆలయ పునర్నిర్మాణంలో చారిత్రక  ఆధారాలు  వెలుగుచూడటంతో  ఒక్కసారిగా  ఈ ఆలయం పేరు  ప్రఖ్యాతలు  ఇనుమడించాయి.  రాష్ట్రంలో  మరెక్కడా లేని  విధంగా  భద్రాచలం  వలె ఇక్కడ విగ్రహాలు ఏకశిలఫై ఉండటం  విశేషం. పూర్వం  సమీప  ప్రాంతాల వారు  మరో భద్రాద్రిగా కొలిచి  నెలరోజుల  పాటు తిరునాళ్ళు జరిపే వారని  పెద్దలు చెబుతున్నారు. ఏత్తయిన  కొండఫై ఉన్న ఈ ఆలయం  ఆభివృద్ధికి శ్రీ  కోదండరామ  ఆలయ  కమిటీ కృషి  చేస్తోంది.  ఇటివల  ఇక్కడ పునర్నిర్మాణానికి  జరిపిన  తవ్వకాల ద్వారా  మరోసారి  ప్రాచుర్యం పోందింది.

బౌద్ధుల నివాసంగా  విరాజిల్లి ............

సముద్ర  మట్టానికి  వెయ్యి ఆడుగల ఎత్తులో ఉన్న   ఈఆలయం వద్ద  ఇటివల జరిపిన తవ్వకాల్లో రెండో  శతాద్ధకాలం  నాటీ బౌద్దారామా చిహ్నాలు, రాగి నాణెములు   బయటపడ్డాయి.
 జనావాసం లేని  ఈ  కొండఫై  ఆరడుగుల లోతైన రాతినీటి తోటలు,అందులో ఇప్పటికి ఆరిపోకుండా  నీటి లబ్యత వామనాకారంలో ఉన్న పోట్టి  విగ్రహం , ఆడుగున్నర కొలత గల  ఇటుకలు  బయటపడటంతో  ఒకప్పుడు  ఇక్కడ బౌద్దులు  నివాసం  ఉండేవారనడానికి  నిదర్సనం .ఈ ప్రదేశానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో  కుడివైపున  ఉన్న కొడవలి  బౌద్దారామం, అయిదు  కిలోమీటర్ల దూరంలో ఎడమవైపున  ఉన్న గంగవరం ,పెనుకోడ  బౌద్దులకు ఆరామాలుగా ఉన్నట్లు  చారిత్రక ఆధారాలు 
చెబుతున్నయి. ఇవే ఇక్కడ బౌద్ధుల సమాచారం ఉన్నాయనేందుకు  తారక్కణలుగా నిలుస్తున్నయి.

 చారిత్రాక ఆనవా ళ్లు..............


              ఎన్నో  చారిత్ర క  ఘటనలుకు  ములగపూడి  వేదికగా నిలిచినట్లు  ఆధారాలు చెబుతున్నయి .ఇక్కడ  సమీపాన 10  కిలోమీటర్ల దూరంలో  ఉన్నా రాఘనపట్నన్ని  14వ  శతాబ్ధంలో పరిపాలించిన రాఘవ రాజు( కితాతు  రాజు ) ఇక్కడ గ్రామంలో 167 ఎకారాల చెరువును  తవ్వించాడు .ఇందుకు నిదర్సనంగా ఇక్కడ రాఘవరాజు రాతి విగ్రహం ఇప్పటికి ఉంది .
         ప్రతిఏటా ఆయనకు గ్రామస్తులు కృతజ్ఞాతతో  పుజులు చేయటం  ఆనవాయితీగా ఉంది . ప్రస్తుతం ఈ రాఘవరాజు  చెరువు  వందల  ఎకరాల భూములకు సాగునీ  రందిస్తుంది. అనంతరం 14వ  శతాబ్ధంలో రాజమహేంద్రవరాన్ని  పరిపాలించిన అనవేమారెడ్డి ,కుమారగిరిరెడ్డి  సమీపాన ఉన్నా  బెండపూడి,వాజ్ర కూటం  ,కిమ్మూరు ,కొట్టం ,దుర్గాలను,రాఘవపట్నం  దుర్గాన్ని  జయిం చినట్లు చారిత్రక  శాసనాలు ద్వారా  తేటతెల్లమవుతోంది. ప్రస్తుతం ఉన్నా రాఘవరాజు  చెరువు ఫై భాగాన  యుద్దంలో  శిధిలమైన గ్రామం ,క్రి.శ  1329 సంవత్సరంలో  సింగమనాయుకుడు వేయించిన అక్కల పాడుశాసనం  ఇందుకు ఆధారాలుగా నిలుస్తున్నాయని రాజనీతి శాస్త్ర,చరిత్ర  పరిసోదుకులు  డాక్టర్ .మిరపల నారాయణరావు గారు  తెలియజేశారు. అయితే మహమ్మదీయుల దండ యాత్రలో  ఈ ఆలయం  శిధిలస్థితికి  చేరిందని ఇక్కడ  పూర్వికుల నుంచి ఒక కథ ప్రాచుర్యంలో  ఉంది .మన్యం  వీరుడు  అల్లూరి సీతారారాజు  ఈ దేవాలయాన్ని సందర్శించినట్లు,ఇక్కడ విప్లవకారులతో  మూడు  సమావేశాలు  జరిపినట్లు ఇప్పటికి  ఇక్కడ పెద్దలు  కథలు కథలుగా  చెబుతారు.....


                                                                   


          

|Home